Wednesday, November 28, 2012

మా మాట


మా మాట
ఈ వెబ్ సైట్ నిర్మించాడినికి కారణాలు రెండు
1)పాశ్చత్య నాగరికత వ్యామోహంలొ,జనవరి 1 వ తేది ని  జరుపుకునే వుత్సాహం,మన "ఉగాది"ని జరుపుకోవడం లో లేదు.మన పిల్లలకి మన సంస్కృతి , సాంప్రదాయల, పండుగల విలువలు మనం నేర్పలేక పోతూ,మమ్మీ, డాడి సంస్కృతి లో వారిని పెంచుతున్నాం.ఆధ్యాత్మికత... అంటే అసలు ఏమిటి? దైవ చింతన. అంటే  దేవుడిని పూజించడం ఆధ్యాత్మిక అని అనుకుంటారు చాలా మంది. అందుకే ఓ దేవుడిని ఎంచుకుని ఆయననే పూజిస్తుంటాం కదా.అయితే మతాలకు అతీతంగా భక్తిని ఏర్పరుచుకోగలిగితే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని సాధించినట్టవుతుంది. దేవుళ్ళకి సంబంధించిన ఇమేజస్, సాంగ్స్, స్త్రోత్రాలు,మొ!!  ఆడియొ, వీడియో మరియు ఈ-బుక్స్ ....... అన్ని ఒక గొడుగు కింద కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వీటికి సంబంధించినవి వివిధ వెబ్ సైట్ ల నుండి, స్నేహితులనుండి సేకరించడం జరుగుతోంది.ఇందులొ ఎక్కువ మంది భాగస్వాములు కావాలని కోరుతున్నాం.ఇక్కడ వుదహరించిన అంశాలలో మీ దగ్గర ఎటువంటి సమాచారం వున్నా,దిగువ తెలిపిన మా mail I.D కి మీ వివరాలతో పాటు పంపితే,  ఆ ఆర్టికల్ మీ వివరాలతో పోస్ట్ చేస్తాం.అలాగే జ్యోతిష్యం అత్యంత పురాతనమైన శాస్త్రం. జ్యోతిష్యం లో, పూజలు , వ్రతాలు చేస్తున్నప్పుడు కలిగే సందేహాలు, ఆధ్యాత్మికమైన ఎన్నో విషయాలలో కలిగే సందేహాలు .వీటిపై అవగాహన వున్న విశిష్ట వ్యక్తులు, గ్రంధాల ద్వారా నివృత్తి చేయబడుతుంది.మీరు మీ సందేహాలు మా గెస్ట్ బుక్ పేజి ద్వారా అడగవచ్చు.ఇలా మన సంస్కృతి, సాంప్రదాయలు, ఆధ్యాత్మిక , జ్యోతిష్య పరిజ్ఞానం కి సంభంధించిన ఒక చక్కటి వేదిక గా రూపుదిద్దాలనే సంకల్పం తో ఈ వేదిక ఏర్పటు చేయబడింది.ఇది కేవలం తొలి అడుగే . అందరి సహాయ సహకారాలతోసంస్కృతి, సంప్రదాయం, సనాతన హిందూ ధర్మం మరియు ఆధ్యాత్మికతల సమ్మేళనంతో ఒక విశిష్ట వేదిక అవ్వాలని ఆశిస్తున్నాం.

2) ఈ వెబ్ సైట్ లో స్థలం అద్దెకి ఇవ్వడం ద్వారా , ఆదాయాన్ని పొంది, దానిని ధార్మిక మరియు సేవా కార్యక్రమాలకి వినియోగించాలనే ఆశయం .ఈ సైట్ ని సందర్శించడమే కాకుండా, ఇందులో చేరి,ప్రకటనలని(ads )ని క్లిక్ చేసి ఒక సత్సంకల్పానికి ప్రోత్సాహం మరియు చేయుతని ఇవ్వాల్సింది గా కోరుతున్నాం.

No comments:

Post a Comment